దేవాపూర్ పోలీస్ స్టేషన్* పరిరది లోని లంబడితాండ-D గ్రామంలో .నేను సైతం లో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు .
అర్జున్ సమాచారం ఆగస్టు 20 బెల్లంపల్లి.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఎస్ఐ గంగారం
ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని కాసిపేట మండలం దేవపూర్ ఎస్ఐ గంగారం అన్నారు. గురువారం కాసిపేట మండలంలోని లంబాడి తండా డి లో నివసిస్తున్న అజ్మీర తిరుపతి నేను సైతం లో బాగంగా నూతనంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అజ్మీర తిరుపతి ని దేవపూర్ ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించి, సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ గంగారం మాట్లాడుతూ నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్థాయి అని తెలిపారు. అజ్మీర తిరుపతి ఆదర్శంగా తెసుకొని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేర నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రత భావం పెరుగుతుందని సూచించారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం ఉంటే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్ట వచ్చని ఎస్ఐ గంగారం పేర్కొన్నారు.